Tirupati: తిరుపతి శివారులో 'చెడ్డీ గ్యాంగ్‌' కలకలం .. l kavalitimes

తిరుపతి: తిరుపతి శివారులో చెడ్డీగ్యాంగ్‌(Cheddigang) సంచరిస్తుందన్న వార్తలతో స్థానిక ప్రజల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. శివారు ప్రాంతంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో ఈ గ్యాంగ్ సంచారం నమోదైంది.. దీంతో అప్రమత్తమైన పోలీసులు గస్తీని ముమ్మరం చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరమై ఈ గ్యాంగ్ ఇళ్లల్లోకి చొరబడి దోపిడీలు చేస్తుంటారు. ఎవరైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తే హతమార్చడానికి కూడా వెనుకాడరు. కాగా.. చెడ్డీగ్యాంగ్ సంచారం వార్తలు దావనంలా వ్యాపించడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. ఇదిలా ఉంటే ఈ గ్యాంగ్ సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గ్యాంగును పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Nov 12, 2023 - 19:47

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow