KA Paul: విశాఖ ఎంపీగా నన్ను గెలిపించండి.. పార్లమెంటులో ఒక ఊపు ఊపుతాను..

విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఉక్కు ఉద్యమం 1000 రోజుకు చేరుకుంది. ఉక్కు ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ దీక్ష శిబిరానికి భారీగా స్టీల్ కార్మిక సంఘాల నేతలు, ఉద్యోగులు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకుంటామని వారు పేర్కొన్నారు. ఇక, కార్మిక సంఘాలకు పలు పార్టీలకు చెందిన నేతలు సంఘీభావం తెలియజేస్తున్నారు.. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఆందోళన చేస్తున్న కార్మికా సంఘాలకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖ స్టీల్ ఫ్లాంట్ కోసం ఎందరో పోరాటం చేశారు అని వ్యాఖ్యనించారు. నేను స్టీల్ ఫ్లాంట్ పరిరక్షణ కోసం న్యాయం పోరాటం చేస్తున్నాను.. స్టీల్ ఫ్లాంట్ భూములు రియల్ ఎస్టేట్ కోసం అమ్ముకుంటున్నారు అని ఆయన ఆరోపణలు చేశారు. నా మీద కేసు పెట్టే దమ్ము ఉందా.. విశాఖ ఎంపీగా నన్ను గెలిపించండి అని కేఏ పాల్ కోరారు. 

Nov 8, 2023 - 22:29
KA Paul: విశాఖ ఎంపీగా నన్ను గెలిపించండి.. పార్లమెంటులో ఒక ఊపు ఊపుతాను..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow