India to America : దొడ్డిదారిన అమెరికా వెళ్లి పట్టుబడిన 96 వేల మంది భారతీయులు..

[11:34, 07/11/2023] +919154440009: India to America : గత సంవత్సరం అక్టోబర్ నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ మధ్య కాలంలో సుమారు 96 వేల 917 మంది భారతీయులు అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించి పట్టుబడ్డారు. అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసిన తాజా గణాంకాలతో ఈ విషయం బయటపడిందని వార్తాసంస్థ పీటీఐ తెలిపింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇలా అక్రమంగా అమెరికాకు వెళ్తున్న భారతీయుల సంఖ్య కొన్నేళ్లుగా పెరుగుతూ పోతోంది. 2020-21లో 30,662 మంది, 2021-22లో 63,927 మంది దొడ్డిదారిన అమెరికా వెళ్లారు. ఇలా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించిన సుమారు 97 వేల మంది భారతీయుల్లో ఎక్కువ మంది గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల వారు. పట్టుబడినవారిలో 30 వేల మంది కెనడా సరిహద్దు దాటి అమెరికాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, 41 వేల మంది మెక్సికో బార్డర్ వైపు నుంచి ప్రయత్నించారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించి పట్టుబడినవారిలో కుటుంబాలు, ఒంటరి యువకులు, మైనర్లు ఉన్నారు. అక్కడ చనిపోయిన వారిలో ఒంటరి యువకులతోపాటు 730 మంది మైనర్లు ఉన్నారు. ఈ విషయంపై యూఎస్ సెనేట్‌లో చర్చ జరిగింది. ''అరెస్టైన వారిలో ఒక్కొక్కరూ నాలుగు విమానాలు మారుతూ అమెరికా బార్డర్‌‌కు చేరుకున్నారు. కొంత మంది ఫ్రాన్స్ మీదుగా మెక్సికో వచ్చి, అక్కడి నుంచి బార్డర్‌‌కు సమీపంలోని విమానాశ్రయానికి, మళ్లీ అక్కడి నుంచి బస్సుల్లో బార్డర్‌‌కు చేరుకున్నారు'' అని సెనేటర్ జేమ్స్ లాంక్‌ఫోర్డ్ నవంబర్ 2న యూఎస్ సెనేట్‌లో చెప్పారు. ''ఒక్క 2023లోనే 45 వేల మందికి పైగా భారతీయులు దక్షిణ సరిహద్దు నుంచి అమెరికాలోకి ప్రవేశిస్తూ పట్టుబడ్డారు'' అని ఆయన తెలిపారు. [12:04, 07/11/2023] +919154440009: Scam Calls Alert : ఆ 10 ఫోన్ నెంబ‌ర్లు య‌మ డేంజ‌ర్... _ ఎత్తితే ఇక బ్యాంకు అకౌంట్లు ఖాళీ.. Scam Calls Alert : టెక్నాల‌జీ ఎంత‌గా డెవ‌ల‌ప్ అయినా సైబ‌ర్ నేర‌స్థులు చెల‌రేగి పోతున్నారు. మోసాలు ఎక్కువ‌గా ఫోన్ల ద్వారా కొన‌సాగుతున్నాయి. ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ ఐటీ కంపెనీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఏయే నెంబ‌ర్ల నుంచి ఎక్కువ‌గా జ‌నం మోస పోతున్నారో వెల్ల‌డించింది. ఆయా నెంబ‌ర్ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించింది. ఆయా ఫోన్ నెంబ‌ర్ల నుంచి ఫోన్ కాల్స్ వ‌స్తే ఎత్త కూడ‌ద‌ని స్పష్టం చేసింది. మాట‌ల్లో పెట్టి బ్యాంక్ అకౌంట్ ను చోరీ చేస్తార‌ని పేర్కొంది. ఇదిలా ఉండ‌గా ఆ 10 ఫోన్ నెంబ‌ర్లు ఇలా ఉన్నాయి. వీటి ప‌ట్ల సీరియ‌స్ గా ఉండాల‌ని సూచించింది స‌ద‌రు సంస్థ‌. 1. (469)709-7630 మీకు ఏదైనా ఆన్‌లైన్ షాపింగ్ డెలివరీ అందక పోతే పై నెంబర్‌కు కాల్ చేయమని మెసేజ్ వస్తుంది. కాల్ చేసిన తరువాత మీ పేమెంట్ పూర్తి కాలేదు. మళ్లీ డబ్బులు చెల్లించమని లింక్ పంపిస్తారు. ముందు చేసిన పేమెంట్ మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయబడుతుందని నమ్మిస్తారు. మీరు డబ్బులు మళ్లీ చెల్లించారో ఇక అంతే సంగతులు. 2 .(865)630-4266 పై నెంబర్ నుంచి కాల్ చేసే దొంగలు.. వెల్స్ ఫార్గో సంస్థలో మీ అకౌంట్‌ని టెంపరరీగా బ్లాక్ చేస్తామ‌ని చెబుతారు. ఆ వెంటనే అన్‌లాక్ చేయడానికి ఒక నకిలీ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్‌కు కాల్ చేస్తే అవతలి వ్యక్తి మీ అకౌంట్ వివరాలు అడిగి.. అందులో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని ఖాళీ చేస్తారు. 3. (805)637-7243 ఈ నెంబర్ నుంచి కాల్ చేసి.. మేము పోలీసుల డిపార్ట్‌మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం. నకిలీ వీసా కేసులో మీపై కేసు నమోదైంది అని భయపెడతారు. ఆ తరువాత పెద్ద మొత్తంలో డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయమంటారు. 4.(858)605-9622 ఈ నెంబర్ నుంచి కాల్ చేసే వారు మీ బ్యాంక్ అకౌంట్ టెంపరరీగా నిలిపేయ బడిందని చెప్పి.. మిమ్మల్ని భయపెడతారు. 5. (863)532-7969 ఈ నెంబర్ నుంచి కాల్ చేసే దొంగలు.. చాలా నిపుణులు. మీ డెబిట్ కార్డ్‌ని 24 గంటలపాటు బ్లాక్ చేసి.. అది సరిచేయాలంటే ఇంత డబ్బు చెల్లించమని అడుగుతారు. 6. (904)495-2599 ఈ నెంబర్ నుంచి కాల్ చేసే దొంగలు.. మీరు ఏటి అండ్ టి అనే రైఫెల్ తుపాకీ గెలుచుకున్నారు .వెంటనే డెలివరీ చేస్తాం డబ్బులు చెల్లించమని అడుగుతారు. 7. (312)339-227 ఈ నెంబర్ నుంచి కాల్ చేసిన వారు మీ అధిక బరువు తగ్గించేందుకు మా వద్ద మంచి ప్రాడక్ట్‌లు ఉన్నాయి.. అని చెబుతూ పెద్ద మొత్తంలో అమ్మకాలు జరిపారు. కానీ అందులో నకిలో మందులు ఉంటాయని తేలింది. 8.(917)540-7996 ఈ నెంబర్ నుంచి కాల్ చేసే దొంగలు.. మీకు స్కీమ్ 6 లో విన్నర్‌గా నిలిచారని చెబుతూ.. వెంటనే మినిమమ్ చార్జీలు చెల్లించమని అడుగుతారు. 9.(347)437-1689 ఈ నెంబర్ నుంచి కాల్ చేసిన వారు పెద్ద పెద్ద స్కామ్‌లు చేస్తారు. అమెరికన్ డాలర్లు మీ అకౌంట్‌లో వేయాలి, మీకు లాటరీ తగిలింది.. మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, వచ్చిన ఓటిపీని అడుగుతారు. 10.(301)307-4601 ఈ నెంబర్ నుంచి కాల్ చేసి మీకు అమెరికా నుంచి పోస్టు రూపంలో ఖరీదైన బహుమతి వచ్చిందని. దాని డెలివరీ కోసం అయ్యే ఖర్చుని ముందుగా చెల్లించమని అడుగుతారు. వీటి ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించింది స‌ద‌రు కంపెనీ.

Nov 7, 2023 - 16:41
India to America : దొడ్డిదారిన అమెరికా వెళ్లి పట్టుబడిన 96 వేల మంది భారతీయులు..

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow