రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా పలు రైళ్లు రద్దు..దక్షిణ మద్య రైల్వే

విజయవాడ, గుంతకల్‌ మధ్య రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా ఈ నెల 20 నుంచి 26 వరకు తిరుపతి, బిట్రగుంట వైపు వెళ్లే పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు దక్షిణమద్య రైల్వే ప్రకటించింది. బిట్రగుంట- డాక్టర్ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌, డాక్టర్ ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-బిట్రగుంట రైళ్లు 24 వరకు... తిరుపతి-కాట్పాడి స్పెషల్‌ ప్యాసింజర్, కాట్పాడి-జోలార్‌పేట, కడప - అరక్కోణం మొమో రైళ్లు 26 వరకు.. రద్దవుతాయని తెలిపింది.

Nov 17, 2023 - 22:08
రైల్వే లైన్ల మరమ్మతుల కారణంగా పలు రైళ్లు రద్దు..దక్షిణ మద్య రైల్వే

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow