పదో తరగతి పరీక్షలు ఖచ్చితంగా నిర్వహిస్తాం :దేవానందరెడ్డి

అమరావతి : రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను తప్పకుండా నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ డి. దేవానందరెడ్డి స్పష్టం చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఉండవంటూ సోషల్ మీడియాలో జరుగు తున్న అసత్య ప్రచారాన్ని నమ్మొద్దని విద్యా ర్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఓ ప్రకటనలో సూచించారు. నూతన జాతీయ విద్యా విధానంలోనూ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిం చాలని స్పష్టంగా ఉందన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనూ కచ్చితంగా పదో తరగతి పరీ క్షలు నిర్వహిస్తామన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు.

Nov 8, 2023 - 22:18

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow