కొల్లేరులో విదేశీ పక్షుల సందడి.. సరస్సుకు కొత్త అందాలు.. పక్షి ప్రేమికులకు కనువిందు

Migratory Birds: కొల్లేరులో విదేశీ పక్షుల సందడి.. సరస్సుకు కొత్త అందాలు.. పక్షి ప్రేమికులకు కనువిందు కొల్లేరులో అధిక సంఖ్యలో కనిపించే విదేశీ పక్షులు స్పాట్ బిల్డ్ పెలికాన్. పిలిఫ్పైన్స్ దేశంలో పుట్టిన విహంగమే అయినా ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో కొల్లేరులోనే ఎన్నో ఏళ్లుగా ఉంటోంది. స్థానికంగా దీనిని గూడ బాతు అని పిలుస్తుంటారు. ఇవి వేటాడే విధానం చూపరులను ఆకట్టుకుంటుంది. ఆకాశంలో విహరించడమే కాకుండా సాధారణ బాతులా నీటిలో గంటల తరబడి ఈదుతూ వేటాడుతుంది. కొల్లేరు మంచి నీటి సరస్సులో విదేశీ పక్షాలు సందడి చేస్తున్నాయి. పచ్చని చెట్లపై వలస పక్షులు చేస్తునటువంటి విన్యాసాలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. కొల్లేరు నివాస యోగ్యంతో పాటు సహజ మత్స్య సంపదకు ఆలవాలంగా ఉండటంతో వేల కిలోమీటర్ల నుంచి ఏటా ఇక్కడికి వస్తుంటాయి. అక్టోబరు నెలాఖరు నుంచి ఫిబ్రవరి చివరి వరకు ఆటపాక వలస పక్షుల కేంద్రం పక్షి ప్రేమికులతో సందడిగా మారుతుంది. కొల్లేరులో అధిక సంఖ్యలో కనిపించే విదేశీ పక్షులు స్పాట్ బిల్డ్ పెలికాన్. పిలిఫ్పైన్స్ దేశంలో పుట్టిన విహంగమే అయినా ఇక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో కొల్లేరులోనే ఎన్నో ఏళ్లుగా ఉంటోంది. స్థానికంగా దీనిని గూడ బాతు అని పిలుస్తుంటారు. ఇవి వేటాడే విధానం చూపరులను ఆకట్టుకుంటుంది. ఆకాశంలో విహరించడమే కాకుండా సాధారణ బాతులా నీటిలో గంటల తరబడి ఈదుతూ వేటాడుతుంది. కొల్లేరు వచ్చే పక్షి జాతుల్లో విశిష్టత కలిగిన పక్షులు పెయిండెడ్ స్టార్క్. ఎర్ర కాళ్ల కొంగగా స్థానికులు పిలుచుకుంటారు. చిత్రకారుడి కుంచె నుంచి జాలువారినట్లు వర్ణశోభితంగా ఉంటాయి. ఇంద్ర ధనుస్సులోని రంగులన్నీ దీని దేహంపై ఉంటాయి. దీని విన్యాసాలు, వేటాడే విధానం, శరీరాకృతి చూస్తే చూపు తిప్పుకోలేం.

Nov 12, 2023 - 16:09
కొల్లేరులో విదేశీ పక్షుల సందడి.. సరస్సుకు కొత్త అందాలు.. పక్షి ప్రేమికులకు కనువిందు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow