ఇ-స్టాంపుల పేరిట పాత స్టాంపుల అమ్మకాలను ఎత్తివేయడం అన్యాయం/ kavalitimes

ఇ-స్టాంపుల పేరిట పాత స్టాంపుల అమ్మకాలను ఎత్తివేయడం అన్యాయం దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి కావలి :ప్రభుత్వం ప్రవేశపెట్టి ఉన్న ఇ-స్టాంపు విధానం కారణంగా పాత స్టాంపుల అమ్మకాలను నిలిపివేయడం అత్యంత దారుణమైన విషయమని దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌.మల్లి పేర్కొన్నారు. బుధవారం కావలి పట్టణంలోని ఆర్‌డిఓ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఆర్‌డిఓకు వినతిపత్రం అందచేసారు. ఈసందర్భంగా దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్‌. మల్లి మాట్లాడుతూ పాత స్టాంపులు ఎంతో ధృఢమైనవి, మన్నికైనవి సుమారు 100 సంవత్సరాలకు పైగా ఉండగలిగే స్టాంపులను అమ్మకుండా, దానిపై బతికే 25 మంది స్టాంపు వెండార్లకు స్టాంపులు లేకుండా చేయడం, ఆ 25 మంది కుటుంబ సభ్యులను రోడ్డున పడవేయడం అన్యాయం అని తెలిపారు. ప్రజలు ప్రతి విషయాన్ని పుట్టుక నుంచి చావు వరకు ప్రతి అంశంలోనూ అఫిడవిట్‌ రూపంలో ప్రభుత్వానికి సమర్పించాల్సిఉంది. ఆ స్టాంపులు ధృడంగాను, మన్నికగా ఉండేవి. ఆ స్టాంపులను ఎత్తివేసి ‘‘జగనన్న సంస్కరణలో భాగంగా ఇస్టాంపింగ్‌ విధానం ప్రవేశపెట్టి ప్రతి విషయంలోనూ సంస్కరణల పేరిట ప్రజలను ఇబ్బంది పెడుతూ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్టాంపులు విక్రయించకుండా, స్టాంపులు విక్రయించే మహిళ వచ్చిన వినియోగదారులతోటి దురుసుగా ప్రవర్తిస్తున్నారని తెలిపారు. స్టాంపులకు కృతిమ కొరతను సృష్టిస్తున్నారని, అధిక ధరలకు అమ్ముతున్నారని ఆరోపించారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రజలను నానా విధాలుగా కష్టాలు పడుతున్నారని కావలి రిజిస్ట్రారు కార్యాలయంలో స్టాంపులు అమ్మే మహిళ దురుసు ప్రవర్తన వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఆమె ప్రవర్తన వల్ల స్టాంపులను కొనుగోలు చేయకుండా బయట ప్రయివేటు వెండర్లపై మొగ్గుచూపి అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని తెలిపారు. . ఇ-స్టాంపింగ్‌ వల్ల జనాన్ని ఇబ్బందికి గురిచేయడం అన్యాయం. తక్షణమే ఇ-స్టాంపులను రద్దుచేసి, సబ్‌ రిజిస్ట్రారు కార్యాలయంలో విక్రయించే మహిళ పై చర్యలు తీసుకుని పాత స్టాంపులను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ముసలి సీనయ్య, పైడి విజయ్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Nov 8, 2023 - 22:51
Nov 9, 2023 - 00:07

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow